కర్నూలు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్నూలు నగరం 16 వార్డులో వైస్సార్సీపీ అభ్యర్థుల కోసం కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రచారం చేస్తుండగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కర్నూలులో ఎన్నికల ప్రచారానికి టీడీపీ గూండాలు అడ్డంకులు సృష్టిస్తున్నారని హఫీజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన కారులో ఎక్కుతూ మీసాలు తిప్పి తొడ కొట్టి సవాల్ విసిరారు. రెండేళ్లు ఆగండి మీ సంగతి చూస్తామంటూ హెచ్చరించారు. పోలీసులు కల్పించుకొని మాజీ ఎమ్మెల్యేకు సర్ది చెప్పి అక్కడినుంచి పంపించి వేశారు.


