Bharath Darpan
Date of Publish : 30/10/2026, 6:53 pm
Published by T Ramanjaneyulu

పోలీసులే ఆదర్శంగా నిలవాలి.. నీరు, విద్యుత్ పొదుపుపై మల్కాజిగిరి సీపీ కీలక ఆదేశాలు!

మల్కాజిగిరి:

ఎల్‌నినో (El Niño) ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ విద్యుత్ మరియు నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్  బి.సుమతి, IPS కోరారు. ఈ మేరకు సహజ వనరుల సంరక్షణపై కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక సూచనలు జారీ చేశారు. "రాబోయే రోజుల్లో ఎదురయ్యే వాతావరణ మార్పులు, నీటి ఎద్దడి ప్రమాదాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. పోలీసు సిబ్బంది మొదటగా క్రమశిక్షణతో వనరులను పొదుపు చేస్తూ ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలి. ప్రజలు కూడా అనవసరంగా విద్యుత్, నీటిని వృథా చేయకుండా అధికారులకు, సమాజానికి సహకరించాలి" అని విజ్ఞప్తి చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights reserved by Bharath Darpan.
PDF Share Save