Bharath Darpan
Date of Publish : 31/10/2026, 5:32 pm
Published by T Ramanjaneyulu

"పాపను కాపాడుకుందాం.. ప్రభుత్వం అండగా ఉంటుంది": రాప్తాడు బాధితురాలి కుటుంబానికి చంద్రబాబు భరోసా!

రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, విద్యార్థినిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్న సీఎం, ఇద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన వివరాలపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ మాట్లాడారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights reserved by Bharath Darpan.
PDF Share Save