హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 13 ఏళ్ల బాలిక గూడ రోహిత అవయవాలను దానం చేసి, ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కన్నబిడ్డను కోల్పోయిన తీరని శోకంలోనూ, అవయవదానానికి ముందుకు వచ్చిన తండ్రి నారాయణరావు గారి ఔదార్యం నన్ను ఎంతగానో కదిలించిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు.
తాను తనువు చాలిస్తూ కూడా ఆరుగురికి పునర్జన్మనిచ్చి అమరజీవిగా నిలిచిన చిన్నారి రోహిత త్యాగం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
ఆ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు.