Bharath Darpan
Date of Publish : 01/11/2026, 9:21 pm
Published by T Ramanjaneyulu

రాప్తాడు కేసులో సంచలనం: అటవీ ప్రాంతంలో నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు!

ఆత్మకూరు (అనంతపురం): అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై చెట్లు నరికే మెషిన్ (రంపం)తో కిరాతకంగా దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అటవీ ప్రాంతంలో గాలింపు: పాఠశాలలో దాడికి పాల్పడిన అనంతరం పరారైన నిందితుడు హేమంత్, ఆత్మకూరు అటవీ ప్రాంతంలో దాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

పోలీసులపై రాళ్లతో దాడి: సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి హేమంత్ తప్పించుకునే ప్రయత్నంలో రాళ్లతో దాడికి తెగబడ్డాడు.

ఆరు రౌండ్ల కాల్పులు: హేమంత్ రాళ్లతో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో, అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.

ఆసుపత్రికి తరలింపు: పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights reserved by Bharath Darpan.
PDF Share Save