Bharath Darpan
Date of Publish : 25/10/2026, 1:42 pm
Published by T Ramanjaneyulu

Mangalagiri Mayor: మంగళగిరి మేయర్ పీఠంపై దశరథ బాబు ఆశలు.. టీడీపీ అధిష్టానం పరిశీలన?

  • మంగళగిరి మేయర్ స్థానానికి ఎస్టీ రిజర్వేషన్.. రేసులో రమావత్ దశరథ బాబు పేరు!
  • చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో మేయర్ పీఠంపై గురి
  • ఉపాధ్యాయుడి నుంచి గ్రూప్-1 అధికారిగా, ఇప్పుడు మేయర్ రేసులో.. ఎవరీ రమావత్ దశరథ బాబు?

విజయవాడ:  మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఎస్టీ రిజర్వేషన్ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆశావహుల పేర్లపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగిన రమావత్ దశరథ బాబు పేరు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే మేయర్ అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తెనాలి పట్టణంలోని చిన్నరావూరు, బాలాజీనగర్‌కు చెందిన దశరథ బాబు విద్యార్హతలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అనుభవం కలిగి ఉన్నారు. గ్రూప్‌-1 ద్వారా ట్రెజరీస్ విభాగంలో జూనియర్ అకౌంట్స్ అధికారిగా పనిచేసిన ఆయన, వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు డీజీపీ కార్యాలయం, విజయవాడలోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. గతంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు.

1989 నుంచి టీడీపీతో అనుబంధం కొనసాగిస్తున్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, మహిళా సాధికారత, గ్రామీణ ప్రజల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆకాంక్షతో ఉన్నట్లు సమాచారం. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్, మేయర్ అభ్యర్థి ఎంపికపై స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తర్వాతే దశరథ బాబు అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights reserved by Bharath Darpan.
PDF Share Save