31/10/2026, Saturday · 07:04:45 PM About UsPrivacy PolicyContact Us
Bharath Darpan

రామ్మూర్తి మాస్టారు రివ్యూ: ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చాటే అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ

T Ramanjaneyulu 31/10/2026 5:38 PM సినిమా 1

రామ్మూర్తి మాస్టారు రివ్యూ: ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చాటే అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ
Want this news as a newspaper clip?Print News Clip

ప్రతి మాస్టారు , ప్రతి మాస్టారి భార్య మరియు కుటుంబ సభ్యులు చూడవలసిన చిన్న సినిమా . గురువుల ఔన్నత్యాన్ని గురించి శ్లాఘించే సినిమాలు చాలానే ఉన్నాయి . మహానటుడు యన్టీఆర్ నటించిన బడిపంతులు సినిమాయే ముందుగా గుర్తుకొస్తుంది నాకు .

ఆ సినిమా తర్వాత నాకు బాగా నచ్చింది ఈ రామ్మూర్తి మాస్టారు అనే చిన్న సినిమా . చక్కటి feel good short movies ని అందిస్తున్న ఈటివి Win వారిని తప్పక అభినందించాలి . మానసిక కాలుష్యాన్ని బాగా తగ్గిస్తున్నారు చక్కటి చిన్న చిన్న feel good సినిమాలతో .

రామ్మూర్తి మాస్టారు త్రికరణశుధ్ధిగా పనిచేసే ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారు . ఆయన స్కూల్ , స్కూల్లో విద్యార్థులు ఆయన లోకం . ఆయన భార్యకు మాత్రం వాళ్ళాయన ట్యూషన్లు చెప్పకుండా , కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పకుండా ఎడాపెడా సంపాదించటం లేదని గుర్రు . మాస్టారి రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆయన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం కలెక్టర్లు , SP లు అయి ఆ ఫంక్షన్లో తమ మాస్టారి ఔన్నత్యం గురించి చెపుతుంటే మాస్టారి గారి సతీమణి హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది .

రామ్మూర్తి మాస్టారిగా తనికెళ్ల భరణి చాలా matured నటనను అందించారు . మాస్టర్లకు ఉండవలసిన సత్వ గుణాన్ని అద్భుతంగా చూపారు . ఆయన అసంతృప్త భార్యగా సుహాసిని బాగా నటించారు . రాఘవేంద్రరావు నిర్మాత . గంగనమోని శేఖర్ దర్శకుడు . శ్రావ్యమైన సంగీతాన్ని , ఢాంఢాంలు లేని BGM ని అందించారు సాయి మధుకర్ . డైలాగులు చక్కగా వినిపించాయి .

 ప్రభుత్వం వారు ఈ సినిమాను అన్ని కళాశాలల్లో , పాఠశాలల్లో మాస్టర్లందరికీ చూపాలని నా విన్నపం . ఈ సినిమాను చూడనివారు తప్పక చూడండి . నింపాదిగా నడుస్తుంది . మలుపులు , కేకలు , ఢాంఢాంలు ఏం ఉండవు . అలా అలా ప్రశాంతంగా సాగుతుంది .

ఇదీ చదవండి :: పోలీసులే ఆదర్శంగా నిలవాలి.. నీరు, విద్యుత్ పొదుపుపై మల్కాజిగిరి సీపీ కీలక ఆదేశాలు!

Ramamurthy MasteruRamamurthy Masteru Movie ReviewTanikella BharaniSuhasiniETV WinETV Win MoviesETV Win Original FilmTelugu Feel Good MoviesGanganomoni ShekharK Raghavendra RaoSai MadhukarTeacher Student MoviesInspirational Telugu

About the author

T

T Ramanjaneyulu

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

45 Posts

Latest News

"పాపను కాపాడుకుందాం.. ప్రభుత్వం అండగా ఉంటుంది": రాప్తాడు బాధితురాలి కుటుంబానికి చంద్రబాబు భరోసా! పోలీసులే ఆదర్శంగా నిలవాలి.. నీరు, విద్యుత్ పొదుపుపై మల్కాజిగిరి సీపీ కీలక ఆదేశాలు! సేవే దివ్యమైన వెలుగు: అమెరికాలోని తెలుగు సమాజానికి NATS పిలుపు టాంటెక్స్ 40వ వార్షికోత్సవ వేడుకల్లో దీపావళి సంబరాల వైభవం: సాహిత్యం, సంస్కృతి, సంగీతాల సమ్మేళనం కర్నూలులో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే Vizianagaram: జడ్పీ పీఠం.. మామా-అల్లుళ్ల సమరం ఆస్ట్రేలియా NRI సెల్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షురాలిగా వీరపనేని వాణి Mangalagiri Mayor: మంగళగిరి మేయర్ పీఠంపై దశరథ బాబు ఆశలు.. టీడీపీ అధిష్టానం పరిశీలన? టెక్సాస్ గడ్డపై అంబరాన్ని అంటుతున్న తెలుగు పండుగ తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర