రాప్తాడు కేసులో సంచలనం: అటవీ ప్రాంతంలో నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు!

ఆత్మకూరు (అనంతపురం): అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై చెట్లు నరికే మెషిన్ (రంపం)తో కిరాతకంగా దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అటవీ ప్రాంతంలో గాలింపు: పాఠశాలలో దాడికి పాల్పడిన అనంతరం పరారైన నిందితుడు హేమంత్, ఆత్మకూరు అటవీ ప్రాంతంలో దాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
పోలీసులపై రాళ్లతో దాడి: సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి హేమంత్ తప్పించుకునే ప్రయత్నంలో రాళ్లతో దాడికి తెగబడ్డాడు.
ఆరు రౌండ్ల కాల్పులు: హేమంత్ రాళ్లతో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో, అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఆసుపత్రికి తరలింపు: పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :: Mangalagiri Mayor: మంగళగిరి మేయర్ పీఠంపై దశరథ బాబు ఆశలు.. టీడీపీ అధిష్టానం పరిశీలన?










